TS EdCET | హైదరాబాద్ : టీఎస్ ఎడ్‌సెట్ -2023 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీ పరిధిలో ఉన్న బీఈడీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం మహాత్మా గాంధీ నిర్వహించిన ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 98.18 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. మే 18న నిర్వహించిన ఎడ్‌సెట్ ప్రవేశపరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరు కాగా, 26,994 మంది(98.18 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
1. గొల్ల వినీష(తాండూరు, వికారాబాద్)
2. నిషా కుమారి(బేగంపేట్, హైదరాబాద్)
3. ఎం సుశీ(బర్కత్‌పుర, హైదరాబాద్)
4. వాసాల చంద్రశేఖర్(మెట్పల్లి, జగిత్యాల)
5. అకోజు తరుణ్ చంద్(శ్రీరాంపూర్, పెద్దపల్లి)
6. తోన్పూల ప్రశాంత్(ఆదిలాబాద్ రూరల్)
7. మహ్మద్ షరీఫ్ సీ(శేరిలింగంపల్లి, రంగారెడ్డి)
8. కుసుమ వినయ్‌కుమార్(కోనసీమ, ఆంధ్రప్రదేశ్)
9. మోటపోతుల అరుణ్ కుమార్(అబ్బాపూర్, ములుగు)
10. ఏ లక్ష్మీ గాయత్రీ(ఎస్ఆర్ నగర్, హైదరాబాద్)