TS EAMCET-2022 | తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్షల హాల్ టికెట్లు శనివారం విడుదలయ్యాయి. జూలైలో పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు eamcet.tsche.ac.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచించింది. జూలై 11 వరకు హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. జూలై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్, మెడిసిన్.. జూలై 18, 19, 20 వరకు ఇంజినీరింగ్ ఎంసెట్ పరీక్షలు జరుగనున్నాయి. ఎంసెట్ పరీక్షలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ మే 28తో గడువు పూర్తవగా.. ఆలస్య లేట్ ఫీజుతో జూలై 7 వరకు దరఖాస్తు అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. మరో వైపు పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.