హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) నోటిఫికేషన్ బుధవారం విడుదల చేయనున్నట్టు టీఎస్ సీపీజీఈటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఈనెల 20 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి సహా పలు వర్సిటీల వైస్చాన్స్లర్లు ఈ నోటిఫికేషన్ను విడుదల చేస్తారు. ఈ ఏడాది సీపీగెట్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకే అప్పగించారు.