BRSV: తెలంగాణమే గుండె చప్పుడుగా ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్కు విశేషంగా మద్దతు లభిస్తోంది. బీఆర్ఎస్వీలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సేన పరిషత్ (TRVSP) విలీనమైంది. శుక్రవారం మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమక్షంలో బీఆర్ఎస్లో విలీనమైన తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సేన పరిషత్ విలీనం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్, జగదీష్ రెడ్డిల సమక్షంలో తన అనుచరుల తో కలిసి టీఆర్వీఎస్పీ (TRVSP) వ్యవస్థాపక అధ్యక్షుడు బంటు సందీప్ బీఆర్ఎస్ లో చేరారు.
ప్రజాపాలన తెస్తామంటూ అధికారంలోకి వచ్చి.. అన్ని విధాలుగా విఫలమైన కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్కు తాము మద్దతిస్తున్నామని సందీప్ తెలిపారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ పార్టీపై అలుపెరగని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్కు తాము అండగా ఉండేందుకే తమ సంస్థను విలీనం చేసినట్టు ప్రకటించిన సందీప్ ప్రకటించారు.