హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి ఉస్మానియా యూనివర్సిటీ ఎందుకు గుర్తుకురాలేదని, అప్పుడెందుకు విద్యార్థులను పలకరించేందుకు రాలేదని టీఆర్ఎస్ ఎన్నారై యూకే అధ్యక్షుడు అశోక్ దూసరి ప్రశ్నించారు. ఉస్మానియా విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో కాంగ్రెస్ నేతలు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వర్సిటీ వాతావరణాన్ని చెదరగొట్టాలని చూస్తున్నారని గురువారం విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే మొదటి స్థానంలో దూసుకుపోతున్నదని గుర్తుచేశారు.