యూకేలో స్పెషల్ రిజిస్ట్రేషన్ కారుతో మంత్రికి స్వాగతం
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ) : యునైటెడ్ కింగ్డమ్లో పర్యటిస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ (యూకే) అధ్యక్షుడు అశోక్‌గౌడ్ దూసరి వినూత్న రీతిలో ఆశ్చర్యపరిచారు. ‘టీఆర్ఎస్.. కేటీఆర్’ అని ఆంగ్ల అక్షరాల్లో కనిపించేలా ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ ఉన్న ఆడీ కారుతో కేటీఆర్‌కు స్వాగతం పలికారు.
‘ప్రత్యేక నెంబర్ ప్లేట్ ఉన్న కారులో నన్ను రైడ్‌కు తీసుకెళ్లిన అశోక్‌కు ధన్యవాదాలు’ అని ట్విట్టర్లో మంత్రి కేటీఆర్‌లో పోస్టు చేశారు. దీనికి స్పందించిన అశోక్.. ‘కేటీఆర్ అన్నా.. దశాబ్దకాలంగా మీరు అందిస్తున్న ప్రేమ, మద్దతు, ప్రోత్సాహకానికి ధన్యవాదాలు. మీ పర్యటన చాలా స్ఫూర్తినిచ్చింది. మరింత నిబద్ధత, నిజాయతీతో పనిచేయడానికి ప్రేరేపించింది. థాంక్యూ అన్నా’ అని ట్వీట్ చేశారు.