Idupu Kayitham First Single | ప్రముఖ నటుడు ప్రియదర్శి, నాగ దుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘ఇడుపు కాయితం’ (IdupuKayitham). తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా నుండి ‘శ్రీలత’ (Srilatha) అనే ఫస్ట్ సింగిల్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. ఈ సాంగ్ లిరికల్ ఫుల్ వీడియోను రేపు సాయంత్రం 5:15 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
బన్నీ వాస్, తబితా సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు.