ఈటల… నీ రక్త చరిత్రపై బహిరంగ చర్చకు సిద్ధమా.. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సవాల్
బీజేపీ నేత ఈటల రాజేందర్ ( Eetela Rajender )ది రక్త చరిత్ర అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ( Padi Kaushik Reddy ) ఆరోపించారు.
హైదరాబాద్ : బీజేపీ నేత ఈటల రాజేందర్‌ది రక్త చరిత్ర అని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తన రాజకీయాల కోసం అనేక మందిని హత్య చేయించిన చరిత్ర ఆయనదని విమర్శించారు. తాను చేసిన ఆరోపణలు అబద్ధమైతే ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. బుదవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. గోతులు తవ్వే అలవాటు ఉన్న ఈటల నీతులు చెబుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని అన్నారు.
చర్చకు సిద్ధమా?
ఈటల రాజకీయ జీవితమంతా హత్యా రాజకీయాలతో ముడిపడి ఉందని.. తన రక్త చరిత్రను కేసీఆర్‌కు అంటించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నర్సింగాపూర్‌లో ఈటలపై గ్రామస్థులు చెప్పులతో దాడి చేసింది నిజం కాదా అంటూ నిలదీశారు. తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్ యాదవ్‌పై ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు దాడి చేయించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. 25 రోజుల క్రితం మల్లయ్యపై దాడి చేయించింది కూడా ఈటలేనని అన్నారు. ఈ రక్త చరిత్రపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని ఈటల రాజేందర్‌కు కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్‌ది హత్యా రాజకీయాల సంస్కృతి కాదని.. ఆయన ప్రత్యర్థులు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తారని గుర్తుచేశారు. ఈటల పైకి కనిపించేంత అమాయకుడు కాదని.. ఆయన చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని ఎద్దేవా చేశారు. తాను చేస్తున్న ఆరోపణల్లో ఏ ఒక్కటి అబద్ధమైనా ముక్కు నేలకు రాస్తానని పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు.
పార్టీ మారితే పద్ధతులు మారుస్తారా?
ఈటల రాజేందర్ మాటిమాటికి కేసీఆర్‌తో పోల్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈటలకు కేసీఆర్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. ఈటల మంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఏ పద్ధతులు ఉన్నాయో.. ఇప్పుడు కూడా అవే పద్ధతులు అమల్లో ఉన్నాయని గుర్తుచేశారు. ఈటల పార్టీ మారినంత మాత్రాన అసెంబ్లీలో పద్ధతులు మారుస్తారా అంటూ ప్రశ్నించారు. అన్నం పెట్టిన కేసీఆర్‌కు అసెంబ్లీ పద్ధతులు మారుస్తారా అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ అభివృద్ధి గురించి చర్చకు రమ్మంటే పారిపోయిన చరిత్ర ఈటలదని అన్నారు. హుజూరాబాద్‌లో యథేచ్చగా గన్ లైసెన్స్‌లు ఇస్తున్నారని.. తనకు ఏమైనా జరిగితే కేసీఆర్‌దే బాధ్యత అని ఈటల అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సానుభూతి రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయిందని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

