తిరుపతి : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలిపిరి పాదాల మండపం నుంచి కాలినడకన తిరుమలకు బయల్దేరారు. కాలినడక ప్రారంభం కంటే ముందు అలిపిరి వద్ద శ్రీవారికి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నానని తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తానని ఆమె పేర్కొన్నారు. అలిపిరి వద్ద వాతావరణ ఆహ్లాదకరంగా ఉందన్నారు. పాదాల మండపం వద్దకు చేరుకోగానే మనస్సు భక్తిభావంతో నిండిపోయింది అని కవిత తెలిపారు.
Today, I will walk to seek the blessings of Lord Venkateshwara Swamy at Tirupati for the well being, prosperity and good health of the people of Telangana and our beloved leader Sri KCR Garu. pic.twitter.com/q8jOF4B6k5
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 17, 2022