రామగిరి, డిసెంబర్ 14: నల్లగొండలో శని, ఆదివారంల్లో నాగార్జున ప్రభుత్వ కళాశాల(ఎన్జీ) మైదానంలో ‘నమస్తే తెలంగాణ’ ‘తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆటో షో’ గ్రాండ్ సక్సెస్ అయింది. చివరి రోజు జిల్లా కేంద్రంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి వినియోగదారులు, సందర్శకులు, కస్టమర్లు భారీ సంఖ్యలో తరలి రావడంతో ప్రాంగణమంతా సందడిగా మారింది. మరో వైపు పలు కంపెలనీ కార్లు, బైకుల, బుకింగ్స్‌తోపాటు డెలివరీ సైతం తీసుకున్నారు. చివరి రోజు రాత్రి 9గంటల వరకు షో నిర్వహించడంతో విశేష స్పందన వచ్చింది. ఆయా కంపెనీల స్టాల్స్ వద్దకు సందర్శకులు ఆసక్తిగా వెళ్లి వాటిని పరిశీలించి, ఫీచర్స్, ఆఫర్స్ తెలుసుకుని టెస్ట్ రైడ్ చేసి కొనుగోలుకు సుముఖత వ్యక్తం చేశారు.
అయితే ఆఖరి రోజున భారీగా సందర్శకులు తరలిరావడమే కాదు.. అదే స్థాయిలో తమకు నచ్చిన వాహనాలను బుకింగ్ చేసుకున్నారు. మరో వైపు చిన్నారుల సాంస్కృతిక, సంప్రదాయ, జానపద నృత్యాలు అలరించడంతో నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తూ ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే సంస్థలకు అభినందనలు తెలిపారు. ఇలాంటి షోలు సంవత్సరంలో రెండు మూడు సార్లు నిర్వహిస్తే బాగుందన్నారు. వాహనాలు కొనుగోలు చేసిన వారికి చివరి రోజు నమస్తే తెలంగాణ ఏడీవీటీ మేనేజర్ కైరంకొండ శివకుమార్, సర్క్యులేషన్ మేనేజర్ మల్సూర్ గౌడ్, ఎడ్యుకేషన్ రిపోర్టర్ బొడ్డుపల్లి రామకృష్ణ, సిటీ రిపోర్టర్ జిన్నె శ్రీనివాస్‌రెడ్డి చేతులమీదుగా ప్రత్యేక బహుమతితోపాటు వాహనాల కీ అందచేసి అభినందనలు తెలిపారు.
చివరి రోజు భారీ సంఖ్యలో సందర్శకుల రాక
నల్లగొండ ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఆటో షో గ్రాండ్ సక్సెస్ అయింది. చివరి రోజు ఆదివారం భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చి బుకింగ్ చేసున్నారు. దీంతో ఈ ప్రాంతమంతా వాహనాలతో కిక్కిరిసింది. రాత్రి ముగింపు సమయం వరకు అదే హోరు కొనసాగింది. కుటుంబ సభ్యులతో వచ్చిన సందర్శకులు వాహనాల ధర, మైలేజ్, ఎన్ని రోజుల్లో డెలివరీ చేస్తారు.. షో ద్వారా ఇచ్చే రాయితీ తదితర వివరాలు తెలుసుకుని బుకింగ్ చేసుకున్నారు. టెస్ట్ డ్రైవ్‌తో సంతోషం వ్యక్తం చేశారు. స్పాట్లోనే పలు సంస్థల కార్లు, బైక్ డెలవరీలు జరిగాయి. చివరి రోజు నిర్వహించిన చిన్నారుల సాంస్కృ నృత్యాలు అలరించాయి.
అదే విధంగా నమస్తే తెలంగాణ తరఫున స్టాల్స్ నిర్వహకులు ప్రత్యేక బహుమతులను, నృత్య ప్రదర్శన చేసిన చిన్నారులకు ముఖ్య అతిథి చేతులమీదుగా అందచేశారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర జ్యూవెలర్స్ నిర్వాహకులు లకుమారపు శ్రీనివాస్ నుంచి 10 గ్రాముల వెండి కాయిన్, వినాయక డ్రైఫ్రూట్స్‌ను నిర్వాహకులు మాదగోని రఘు రూ.1000 విలువ చేసే డ్రైఫ్రూట్స్‌ను లక్కీ డిప్ విజేతలకు బహుమతిగా అందచేశారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే నల్లగొండ ఉమ్మడి జిల్లా ఎడీవీటీ మేనేజర్ కైరం కొండ శివకుమార్, సర్క్కులేషన్ మేనేజర్ మారగోని మల్సూర్ గౌడ్, ఎడ్యుకేషన్ రిపోర్టర్ బొడ్డుపల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఒకే వేదిక హర్షణీయం
రామగిరి, డిసెంబర్ 14: వాహనాలు కొనుగోలు చేయాలనే వారు తాము ఎలాంటి వాహనాలు కొనుగోలు చేయాలో తెలియక పలు కంపెనీలకు వెళ్లి పరిశీలించాల్సి ఉంటుంది. అయితే అలాంటి ఇబ్బంది లేకుండా ‘నమస్తే తెలంగాణ’ ‘తెలంగాణ టు డే’ ఆధ్వర్యంలో ఒకే వేదికపై ఇంతటి గొప్ప అవకాశం కల్పించడం హర్షణీయమని మహాత్మాగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) సీనియర్ అసోసియేట్ ప్రొఫెసర్, ఎంజీయూ హస్టల్స్ డైరెక్టర్ డా. దోమల రమేష్ అన్నారు. నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో ‘నమస్తే తెలంగాణ’ తెలంగాణ టు డే ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో నిర్వహించిన ‘ ఆటో షో’ ఆదివారం రాత్రి ముగిసింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మొదట ఆటో షోలోని కార్లు, బైక్స్, కంపెనీల స్టాళ్లను పరిశీలించారు.
అనంతరం ఆయన వేదికపై మాట్లాడుతూ ఒకే దగ్గర అన్ని రకాల వాహనాలు ఉంచడం వాహన ప్రియులకు మంచి అవకాశమన్నారు. వాహనాలు తీసుకున్న వారికి తక్షణం రుణ సదుపాయం అందించేలా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను కూడా అందుబాటులో ఉంచడం చాలా సంతోషకరమన్నారు. అనంతరం నమస్తే తెలంగాణ ఏడీవీటీ మేనేజర్ కైరంకొండ శివకుమార్, సర్య్కులేషన్ మేనేజర్ మారగోని మల్సూర్ గౌడ్, ఎడ్యుకేషన్ రిపోర్టర్ బొడ్డుపల్లి రామకృష్ణ, సిటీ రిపోర్టర్ జిన్నె శ్రీనివాస్‌రెడ్డి, టెక్నికల్ ఇంజనీర్ సుంకర బోయిన సుదర్శన్, ఏడీవీటీ , సర్క్కులేషన్ అన్వర్ పాషా, శివ, ఎస్కే మదార్, సురేష్, అఖిల్‌తో కలిసి లక్కీ డ్రాలో విజేతలైన వారితో పాటు నృత్య ప్రదర్శన చేసి చిన్నారుకు, ఆటో షో స్టాల్స్‌కు బహుమతులు అందచేసి అభినందించారు.
సందర్శకులతో సందడి
రామగిరి, డిసెంబర్ 14: నల్లగొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే నిర్వహించిన ఆటో షోలో ఆదివారం రెండో రోజు సందర్శకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒకే వేదికపై పలు కంపెనీల కార్లు, బైక్‌లు ఉంచడంతో నిర్వాహకులైన నమస్తే తెలంగాణకు కష్టమర్లు, సందర్శకులు అభినందనలు తెలిపారు. మరో వైపు తమ స్టాల్స్‌కు మందచి ఆదరణ వచ్చిందంటూ స్టాల్స్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.
సుజికి వాహనాలకు మార్కెట్లో ఎంతో ఆదరణ..
మార్కెట్లో సుజీకి వాహనాలకు మంచి ఆదరణ ఉంది. ఆటో షోలో చాల మంది హాజరై వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. ఈ క్రమంలో బుకింగ్స్ వచ్చాయి. గతంలో ఏ సంస్థ నిర్వహించని విధంగా నల్లగొండలో ఇలాంటి ఆటో షో నిర్వహించడంతో నమస్తే తెలంగాణకు, మా కంపెనీ వెహికిల్స్‌కు మంచి ఆదరణ లభించిందని భావిస్తున్నాం.
-నితిన్‌రెడ్డి, ఎజీఎం సేల్స్ , కాసా సుజీకి, నల్లగొండ
రాయల్‌గా ఉంటాయి..
రాయల్ ఎన్ఫీల్డ్ రాయల్‌గా ఉంటుంది. ఇంత మంచి ఆవకాశం కల్పించిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే యాజమన్యాలకు కృతజ్ఞతలు. షోలో మాస్టాల్కు మంచి ఆదరణ వచ్చింది. చాలా మంది స్టాల్స్‌ను సందర్శించారు. అతి తక్కువ ఈఎంఐతో వాహనాలు అందిస్తాం.
-వినయ్ కుమార్‌రెడ్డి, సేల్స్ ఎగ్జిక్యూటివ్, వెంకటరమణ మోటర్స్ రాయల్ ఎన్ఫీల్డ్,నల్లగొండ
అత్యాధునిక మోడల్లో కియా..
మార్కెట్లో అత్యాధునిక హంగులతో కూడిన మోడల్ కియా కార్లు అందుబాటులో ఉన్నాయి. మంచి మైలేజీతో పెట్రోల్, డీజిల్ వెర్షన్స్ కియా మోటర్స్ సొంతమని చెప్పవచ్చు. కారిస్సీక్లావిస్ సేల్స్‌లో టాప్‌లో ఉంది. రూ 1.20 లక్షల డిస్కాంట్ ఇస్తున్నాం. రూ. 60వేల ఆర్సీతో ఎక్సేంజీ బోనస్ తో పాటు సపోర్టు బెనిఫిట్స్ ఇస్తున్నాం.
– మారపాక ఆంజనేయులు, కియా మోటర్స్ ,నల్లగొండ
ఆటో షో బాగుంది..
జిల్లా కేంద్రంలో నమస్తే తెలంగాణ నిర్వహించిన ఆటో షో బాగుంది. అతి తక్కువ ధరలకే మా వాహనాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో సందర్శకులు వాహనాల ఫీచర్స్‌ను తెలుసుకుని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మంచి సేఫ్టీ ఫీచర్స్ మా కార్లలో ఉన్నాయి.
– విశ్వనాథ్, మార్కెటింగ్ మేనేజర్, ప్రైడ్ సిట్రెన్ మోటర్స్
హోండా బైక్‌లకు మంచి ఆదరణ..
మా హోండా బైక్స్‌కు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. పెద్ద సంఖ్యలో సందర్శకులు వచ్చి వాహనాలు పరిశీలించారు. ఎస్పీ 161, సీబీ పర్నెట్ 180సీసీ, సీబీ 200కే, డియో 125సీసీలపై రూ. 12వేల వరకు రాయితీ ఉంది. అదే విధంగా మా వాహనాలు కొనుగోలు చేసిన వారికి ప్రత్యేక బహుమతిగా 32 సెంటీమీటర్ల స్మార్ట్ టీవీ ఉచితంగా అందిస్తున్నాం. డిసెంబర్లో ప్రత్యేక ఆఫర్స్ ఉన్నాయి.
– జి.సైదులు, పేల్స్ ఇన్చార్జి, కుషాల్ హోండా, నల్లగొండ
స్పందన బాగుంది ..
ఇతర కంపెనీల కంటే హుందాగా ఉండే వెహికిల్‌గా మా వాహనాలకు మంచి స్పందన ఉంది. మరో ఆకర్షణీయమైన మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్స్ఎల్- 6తోపాటు పలు వాహనాలపై ఇయర్ ఎండింగ్ ఆఫర్స్ ఉన్నాయి. ఆర్డర్ ఉండగానే వెంటనే అందచేస్తాం.
-సీహెచ్.సుధాకర్, హెచ్ఆర్, పవన్ మోటర్స్ నెక్సా, నల్లగొండ