రెబ్బెన, డిసెంబర్ 14 : బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులను భారీ మోజార్టీతో గెలిపించాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పిలుపునిచ్చారు. ఆదివారం తరెబ్బెన మండలం గోలే టి, రెబ్బెన గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు అజ్మీర బాబురావు, దుర్గం భరద్వాజ్‌తో పాటు వార్డు మెంబర్లను గెలిపించాలని కోరుతూ ర్యాలీ తీశారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు.
ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని గ్రామాలు బీఆర్ఎస్ సర్కా రు హయాంలో ఎంతో అభివృద్ధి సాధించాయన్నారు. ఈ నెల 17న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మర్సకోల సరస్వతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొటు శ్రీధర్‌రెడ్డి, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, ఏఎంసీ మాజీ చైర్పర్సన్ పర్లపల్లి వనజ, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ , టీబీజీకేఎస్, బీఆర్ఎస్ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఉప సర్పంచ్‌లు ఉన్నారు.