హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా సీఎం కేసీఆర్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. చెన్నూరు మండలం సోమన్‌పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరిని ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రక్షించడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.
విధి నిర్వహణకు వెళ్ళి, వరదల్లో కొట్టుకుపోయిన జగిత్యాలకు చెందిన జర్నలిస్టు జమీర్ మరణం అత్యంత బాధాకరం. జమీర్ కుటుంబానికి అండగా నిలుస్తామని కవిత పేర్కొన్నారు. వార్తా సేకరణకు ప్రాధాన్యత ఇస్తూనే, వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా మిత్రులను కోరుతున్నట్లు కవిత తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా సీఎం కేసీఆర్ గారు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. చెన్నూరు మండలం సోమన్ పల్లి వద్ద గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరిని ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా రక్షించడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనం. pic.twitter.com/OoXGKPKg8h
— Kavitha Kalvakuntla (@RaoKavitha) July 15, 2022