హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ శ్లోకాన్ని కవిత ట్వీట్ చేశారు. దాంతో పాటు హనుమంతుడి శ్లోకాన్ని పఠించిన వీడియోను కూడా కవిత షేర్ చేశారు.
కవిత ట్వీట్ చేసిన శ్లోకం ఇదే..
బుద్దిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్
(చక్కని ఆలోచనను సరైన వేళలో అందించగల బుద్ధీ, ఆ ఆలోచనలను అమలుచేయగల మనోబలం. అలా అమలుచేసి సత్ఫలితాన్ని సాధించినందువల్ల చక్కని కీర్తి. ఇలాంటి కీర్తిని సాధించిన కారణంగా మరో మంచిపనిని కూడా సాధించగలమనే ధైర్యం, అలా ధైర్యంగా పనిచేస్తున్నందు వల్ల భయం లేనితనం.)
బుద్దిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా !!
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాద్భవేత్ !!మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు..#HanumanJayanti pic.twitter.com/lTLBboON4e
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 16, 2022