హైదరాబాద్ : కేంద్రం బడ్జెట్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. హర్ ఘర్ నల్ సే జల్ పథకానికి కేంద్రం రూ. 60 వేల కోట్లు కేటాయింపులు చేసిన నేపథ్యంలో.. ఈ సారైనా మిషన్ భగీరథకు నిధులు కేటాయించాలని ఆమె కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం.. ప్రతి ఇంటికి ఉచితంగా మంచినీటిని అందించడంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఇలాంటి అద్భుతమైన పథకానికి రూ. 19,205 కోట్లు కేటాయించాలని నాలుగేండ్ల క్రితం నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫారసు చేసింది. కానీ కేంద్రం స్పందించలేదు. హర్ ఘర్ నల్ సే జల్ పథకానికి చేసిన రూ. 60 వేల కేటాయింపుల్లో భాగంగా మిషన్ భగీరథకు కూడా నిధులు కేటాయించాలని కవిత కోరారు.
CM KCR’s flagship project MissionBhagiratha is a pioneer in providing piped water to every household. @NITIAayog recommended ₹19,205Cr to Telangana 4 years ago,at least this year will the Union Govt provide the recommended funds to Telangana under ₹60,000Cr of #HarGharNalSeJal pic.twitter.com/BjSnPQVRye
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 1, 2022