హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చొరవతో ఓ తల్లి ప్రసవ వేదన తీరింది. ఏ ఆటంకం లేకుండా ఓ చిట్టి ప్రాణం ఈ ప్రపంచంలోకి వచ్చింది. కోస్గికి చెందిన జ్యోతిబాయి 9 నెలల గర్భవతి. అయితే డెలివరీ డేట్ కంటే ముందే నొప్పులు రావడంతో పాటు రక్తం తక్కువగా ఉండడంతో అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచించారు. క్యాబ్ డ్రైవర్ అయిన జ్యోతిబాయి భర్తకు ఆ ఆపరేషన్ చేయించడం ఆర్థికంగా భారంగా మారింది. దీంతో జ్యోతి బాయి మరిది ట్విట్టర్ లో సహాయం కోసం అభ్యర్థించాడు. మనసున్న కొంతమంది మంచి మనుషులు స్పందించారు. కొంత మొత్తం నగదు జమైంది. కానీ ఆపరేషన్ ఖర్చుకు అది ఎంత మాత్రం సరిపోదు. మరోవైపు జ్యోతి బాయి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా మారడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు.
అయితే జ్యోతి బాయి గురించి ఎమ్మెల్సీ కవిత కు తెలియడంతో ఆ కుటుంబానికి ఓదార్పు దక్కింది. జ్యోతి బాయి ఆపరేషన్ ఖర్చును భర్తిస్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. కవిత చొరవతో జ్యోతిబాయికి క్లిష్టమైన ఆపరేషన్ ఈ రోజు పూర్తైంది. పండండి బిడ్డకు జ్యోతిబాయి జన్మనిచ్చింది. తల్లిబిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో తెలిపి ఎమ్మెల్సీ కవిత సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత చేసిన సహాయంతో జ్యోతిబాయి భర్త, మరిది భావోద్వేగానికి లోనయ్యారు. కవిత మేడం స్పూర్తితో తాము కూడా ఆపదలో ఉన్నవారికి చేతనైనంత సహాయం చేస్తామని ప్రకటించారు. క్యాబ్ డ్రైవర్ లు అయిన వారు ఇక నుంచి తాము గర్భిణీలను ఉచితంగా హాస్పిటల్స్ కు తీసుకుపోతామని ప్రకటించారు.
Praying for well being and good health of both the mother and the child. God bless !! https://t.co/KcH0XarAgk
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 24, 2021