హైదరాబాద్ : తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం ట్విట్టర్లో సంఘీభావం చెప్పడం సరికాదన్నారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రానికో విధానం ఉండకూడదన్నారు. పంజాబ్, హర్యానాలో ధాన్యం సేకరించిన మాదిరిగానే తెలంగాణ నుంచి ధాన్యం సేకరించాలని కోరుతున్నామని కవిత తెలిపారు.
ఈ రెండు రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు ఒక నీతి ఉండకూడదని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలియజేయాలని రాహుల్‌కు సూచన చేశారు. ఒకే దేశం – ఒకే సేకరణ విధానం కోసం రాహుల్ డిమాండ్ చేయాలని కవిత సూచించారు.
తమ నిరసన తెలియజేస్తున్నారు..
మీకు నిజాయితీ ఉంటే తెలంగాణ ఎంపీలకు మద్దతుగా వెల్ లోకి వచ్చి నిరసన తెలియజేయండి..
ఒక దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి.. 2/2#TelanganaWithKCR— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2022