హైదరాబాద్ : మంచిర్యాలలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ-3 సింగరేణి బొగ్గు గనిలో పై కప్పు కూలి నలుగురు కార్మికులు మృతి చెందిన విషయం విదితమే. సింగరేణి కార్మికుల మృతిపట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంతాపం ప్రకటించారు. ఈ ఘటన తీవ్ర దిగ్ర్భాంతిని కలిగించిందన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా నిలుస్తాము అని భరోసానిచ్చారు. మృతులు కృష్ణారెడ్డి(59), లక్ష్మయ్య(60), చంద్రశేఖర్(29), నర్సింహరాజు(30).
మంచిర్యాలలోని శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ-3 సింగరేణి బొగ్గు గనిలో పై కప్పు కూలి నలుగురు కార్మికులు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా అండగా నిలుస్తాము.
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 10, 2021