హైదరాబాద్ : త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ మృతిపట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులికతో పాటు 11 మంది సైనిక సిబ్బంది మృతి చెందడం తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని కవిత ట్వీట్ చేశారు. ఈ నష్టాన్ని భరించే శక్తిని, మృతుల కుటుంబాలకు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నట్టు ఆమె పేర్కొన్నారు. మాతృభూమి రత్నాలను కోల్పోయిన మనందరికీ ఇవాళ చాలా బాధాకరమైన రోజు అని కవిత ఆవేదనకు లోనయ్యారు.
Deeply shocked to hear the news of tragic army chopper crash with CDS Bipin Rawat ji, his wife and 11 other army personnel onboard. May god give their families the strength to bear with this loss. It is indeed a very sad day for all of us to have lost the gems of our motherland. pic.twitter.com/qa5U6i73lH
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 8, 2021