వికారాబాద్ : పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ కార్తీక కోటి దీపోత్సవం కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటి దీపోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి దంపతులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కోటి దీపోత్సవంలో పాల్గొన్న వారందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కవిత ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి, వికారాబాద్, చేవెళ్ల ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, స్థానిక టీఆర్ఎస్ నాయకులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.