
హైదరాబాద్: బీజేపీ, వీ6, రాజ్ న్యూస్ చానల్‌పై ఎన్నికల కమిషన్‌కు టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. బీజేపీ అభ్యర్థి మీడియాతో మాట్లాడటంపై, కార్యకర్తలు ప్రచారం చేయడంపై మెయిల్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీజేపీ అభ్యర్థి మీడియా సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసినందుకు చేసినందుకుగాను వీ6, రాజ్ న్యూస్ చానల్‌పై చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొన్నది.

బీజేపీ అభ్యర్థి ఈటల కమలాపూర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దీనిని వీ6, రాజ్ న్యూస్ చానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి.