న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో (ఈసీ) బీ(టీ)ఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చుతూ చేసిన తీర్మానం కాపీని ఈసీ అధికారులకు అందించారు. పేరు మార్పును గుర్తించాలని కోరారు. బుధవారం (ఈనెల 5న) టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా (టీఆర్ఎస్) మారుస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ నేతృత్వంలో బృందం నేడు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమయింది.
డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మకు తీర్మానం కాపీ అందించామని వినోద్ కుమార్ చెప్పారు. చట్టప్రకారం పరిశీలించి అనుమతి ఇస్తామని చెప్పారని ఆయన వెల్లడించారు.
కాగా, ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏయే నిబంధనలు అనుసరించాలన్న దానిపై ఎన్నికల కమిషన్ ఏం చెప్తున్నదో పరిశీలిద్దాం.
ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కేంద్ర ఎన్నికల సంఘం-1968 నిబంధనలకు లోబడి ఉండాలి. ఈ క్రింది మూడు నిబంధనల్లో కనీసం ఏదో ఒక నిబంధనను పూర్తిచేయాలి.
జాతీయ పార్టీగా లేదా ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందితే ఆ హోదా శాశ్వతంగా ఉండదు. ఎన్నికల తరవాత ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి హోదా ఉండటం లేదా కోల్పోవడం జరుగుతుంది. ఈ కారణంగానే జాతీయ పార్టీల సంఖ్య, ప్రాంతీయ పార్టీల సంఖ్య తరుచూ మారుతున్నది.