ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, నవంబర్ 19: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టి స్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వైపే ప్రజలు ఉన్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని క్యాంపు కార్యాలయంలో హన్వాడ మండలం లింగన్నపల్లికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాదాపు 100 మందికిపైగా మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మంత్రి వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రం లోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ప్రతిపక్షాల తీరుతో విసుగుచెందిన ఆయా పార్టీల నాయకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు.