సోమవారం 25 జనవరి 2021
Telangana - Dec 04, 2020 , 17:11:58

రైతులకు అండగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం

రైతులకు అండగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం

వరంగల్ రూరల్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడు రైతులకు అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని కొమ్మాల గ్రామంలో ఓడీసీఎంఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, విశ్వనాధపురం గ్రామంలో రైతు వేదిక, ప్రకృతివనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు.

కరోనా సమయంలో కూడా రైతులను ఆదుకున్న ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామ పంచాయతీలు అభివృద్ధి జరిగాయని, పల్లె ప్రకృతి వనంతో పల్లె వాతావరణం పచ్చగా మారుతుందన్నారు. టెక్స్ట్ టైల్ పార్క్ ద్వారా గీసుగొండ మండల యువతకు ఉపాధి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. 


logo