గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 12:56:10

దివ్యాంగులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం

దివ్యాంగులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం

హైదరాబాద్‌ : దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉన్న ఘనత సీఎం కేసీఆర్‌ దేననని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వివిధ ‌ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గురించి చర్చించారు. దివ్యాంగులకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని, ఎమ్మెల్సీ కవిత భరోసానిచ్చారు‌. 

రాష్ట్రంలో ఉన్న మొత్తం 4.90 లక్షల మంది దివ్యాంగులకు నెలకు రూ. 3,016కు పెన్షన్ తో‌ పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. గత ఆరేండ్లుగా దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌కు దివ్యాంగులు ఈ‌ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.