నిజామాబాద్ : వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తలపెట్టిన నియోజకవర్గ స్థాయి ధర్నా కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద భారీ ఎత్తున రైతులతో ధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన రైతులు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్లకార్డ్ ప్రదర్శిస్తూ ధర్నాలో పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు హోరెత్తించారు.