చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వాలి
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ వెంటనే ఆమోదించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో తీర్మానించారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ప్రవేశపెట్టారు.
- మంత్రి సత్యవతి రాథోడ్ తీర్మానం
- బలపర్చిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ వెంటనే ఆమోదించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో తీర్మానించారు. ఈ తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ ప్రవేశపెట్టారు.
2010లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపితే ఇంత వరకు లోక్‌సభలో ఆమోదం పొందలేదని గుర్తుచేశారు. మార్కెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు కేసీఆర్ అమలు చేస్తున్నారని చెప్పారు. బీజేపీకి కేంద్రంలో సంపూర్ణమైన మెజార్టీ ఉన్నప్పటికీ బిల్లును ఎందుకు ఆమోదించడంలేదని నిలదీశారు. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ఈ తీర్మానాన్ని బలపర్చారు. సమాజంలో సభ భాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేదని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

