హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఆస్ట్రేలియాశాఖ అధ్యక్షుడిగా కాసర్ల నాగేందర్‌రెడ్డి మూడోసారి నియమితులయ్యారు. 2016లో ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్శాఖను స్థాపించినప్పటి నుంచి కాసర్లే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియాలో టీఆర్ఎస్ అభివృద్ధికి కృషి చేస్తున్న కాసర్లను మూడోసారి అధ్యక్షుడిగా నియమించినట్టు ఆ పార్టీ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసంలో కాసర్లకు మహేశ్ బిగాలతో కలిసి నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
వాలీబాల్ ఆటగాడు మహేశ్‌కు కవిత ఆర్థికసాయం
ఆస్ట్రేలియాలో జరగనున్న బీచ్ పారావాలీ నేషనల్ సిరీస్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైన టీఆర్ఎస్ కార్యకర్త, క్రీడాకారుడు మహేశ్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో మహేశ్‌కు లక్ష రూపాయల అర్థికసాయం అందజేశారు. ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రాలో 16 నుంచి 20 వరకు జరిగే టోర్నమెంట్లో మహేశ్ పాల్గొననున్నారు.