Roslin | మలయాళం, తెలుగు, తమిళ భాషా ప్రేక్షకులకు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని యాక్టర్ వినీత్. ప్రేమదేశం సినిమాతో యూత్‌లో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. చివరగా తెలుగులో రంగ్ దే సినిమాలో మెరిసిన ఈ యాక్టర్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. వినీత్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ Secret Stories: Roslin.
సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ ప్రాజెక్టును దృశ్యం ఫేం జీతూ జోసెఫ్ పర్యవేక్షణలో సుమేశ్ నందకుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. కాగా రొస్లిన్ స్ట్రీమింగ్ డేట్‌ను ఫైనల్ చేశారు. రొస్లిన్ ఫిబ్రవరి 27న సందడి చేయనుంది. ప్రమోషనల్ ఈవెంట్లో రిలీజ్ డేట్‌ను ప్రకటించారు మేకర్స్. అయితే పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం జియో హాట్‌స్టార్ నుంచి స్ట్రీమింగ్ డేట్‌పై
అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ మూవీని ఇతర భాషల్లో కూడా విడుదల చేయనున్నట్టు సమాచారం.
ఈ మూవీలో సంజనా దీపు స్లిన్ (టైటిల్ రోల్)లో నటించింది. సెంట్రల్ అడ్వర్టైజింగ్ బ్యానర్‌పై మాథ్యూ జార్జ్ నిర్మించారు. ఈ వెబ్ సిరిస్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలో రిలీజ్ కానుందని సమాచారం.
Supritha | మా అమ్మకు మళ్లీ పెళ్లి చేయాలనుంది … సుప్రిత ఎమోషనల్ కామెంట్స్ వైరల్