MP Asaduddin Owaisi: అస్సాం సీఎంపై చర్యలు తీసుకోండి.. హైదరాబాద్ సీపీకి ఓవైసీ ఫిర్యాదు
MP Asaduddin Owaisi: ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. ఇవాళ హైదరాబాద్ పోలీసు కమీషనర్ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో ఆయన కోరారు. పాయింట్ బ్లాంక్ షాట్ వీడియో వివాదం నేపథ్యంలో ఆ ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(MP Asaduddin Owaisi).. ఇవాళ హైదరాబాద్ పోలీసు కమీషనర్ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో ఆయన కోరారు. ఇటీవల సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు అయిన వీడియో అంశంపై ఆయన ఫిర్యాదు చేశారు. అస్సాం బీజేపీ శాఖకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లో ఇటీవల ఓ వీడియో పోస్టు చేశారు. ఆ వీడియోలో సీఎం బిశ్వ శర్మ తన వద్ద ఉన్న రైఫిల్‌తో ముస్లింలను కాల్చివేస్తున్నట్లుగా ఉన్నది. పాయింట్ బ్లాంక్ షాట్ అని వీడియోకు ట్యాగ్ ఇచ్చారు.
హైదరాబాద్ సీపీకి ఇచ్చిన ఫిర్యాదు గురించి ఓవైసీ తన ఎక్స్‌లో పోస్టు చేశారు. దురదృష్టవశాత్తు దేశంలో విద్వేషాలు సాధారణంగా మారినట్లు పేర్కొన్నారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీయాలన్న ఉద్దేశంతో, కావాలని ఆ వీడియోను చిత్రీకరించినట్లు ఓవైసీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు మతాలకు చెందిన ప్రజల మద్య శత్రుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నట్లు ఆరోపించారు. జాతీయ సమగ్రతను దెబ్బతీస్తున్నట్లు పేర్కొన్నారు.
I have lodged an official complaint with @CPHydCity demanding criminal action against Himanta Sarma for his (now deleted) violent video showing him shooting Muslims. Unfortunately, genocidal hate speech has become a norm. pic.twitter.com/o1OVUl6MWk
— Asaduddin Owaisi (@asadowaisi) February 9, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

