తిమ్మాజిపేట, డిసెంబర్ 24 : నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డిని మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుతోపాటు పలువురు పరామర్శించారు. ఇటీవల మర్రి తండ్రి జంగిరెడ్డి అకాల మరణం చెందడంతో కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు మాజీ మంత్రు లు జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మ హమూద్అలీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పరామర్శించారు. తిమ్మాజిపేట మండలం నేరళ్లపల్లికి ఒకే కారులో వచ్చిన కేటీఆర్, హరీశ్‌రావు మాజీ ఎమ్మెల్యే మర్రిని ఆలింగనం చేసుకొని ఓదార్చారు. అనంతరం జంగిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దాదాపు గంటసేపు అక్కడే ఉండి మర్రి తల్లి అమృతమ్మతో మాట్లాడి ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి వెంట ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, బాల్క సుమన్, గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బడుగుల లింగయ్య యా దవ్, ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు ఉన్నారు.