హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చరిత్ర అంతా.. కాళోజీ నారాయణరావు చరిత్రే అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. హై దరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, గాదరి కిశోర్, పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, వాసుదేవరెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, రూప్సింగ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మహిళా నాయకురాళ్లు తుల ఉమ, ముక్తవరం సుశీలారెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్, పడాల సతీశ్ పాల్గొన్నారు.
ఢిల్లీలో తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు 110వ జయంత్యుత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ జ్యోతిప్రజ్వలన చేశారు.