హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల మహా విగ్రహ రూపశిల్పి రామ్ వీ సుతార్‌ను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఘనంగా సన్మానించారు. ప్రభుత్వ తరఫున మెమోంటో అందజేసి, శాలువాతో సత్కరించారు.
విగ్రహ నిర్మాణంలో తమదైన పాత్ర పోషించిన ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, ఈఈ రవీంద్రమోహన్, ఆర్కిటెక్ట్ జయ్ కాక్టీకర్, కేపీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు అనిల్‌కుమార్, కొండల్‌రెడ్డి, వంశీవర్ధన్రెడ్డిని సైతం ప్రభుత్వం తరఫున మంత్రులు సన్మానించారు. ఆ తర్వాత ఆర్అండ్బీ అధికారులు, కేపీసీ ప్రతినిధులు కలిసి మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, ఈశ్వర్‌లను సన్మానించారు.