హైదరాబాద్, ఏప్రిల్4 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నేపథ్యంలో ఎస్వోసీ (స్టేట్మెంట్ ఆఫ్ కేస్)ను దాఖలు చేయలేకపోతున్నామని, ఈ నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు ఏపీ సర్కారు విజ్ఞప్తి చేసింది. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ ఈ నెల 8 నుంచి ఢిల్లీలో ప్రారంభం కావాల్సి ఉన్నది. 1956లోని సెక్షన్3 ప్రకారం విచారణ చేపట్టాల్సిన అంశాలపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్వోసీ)ను దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు దాఖలు చేయలేదు. తాజాగా ఎస్వోసీ దాఖలుకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారిందని, ఈ నేపథ్యంలో మరింత గడువు ఇవ్వాలని కోరుతూ ట్రిబ్యునల్‌కు ఏపీ విజ్ఞప్తి చేసింది.