కెరమెరి, జూన్ 24 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పలు గ్రామాలకు మంగళవారం తాగు నీటిని సరఫరా చేశారు. తాగు నీరందక గిరిజనులు సోమవారం కెరమెరి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేశారు.
ఈ విషయమై ‘సారూ.. మీ కాళ్లు మొక్కుతం.. తాగడానికి నీళ్లియ్యండి’ అనే శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రధాన సంచికలో వార్త ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన ఎంపీడీవో మహ్మద్ అమ్జద్పాషా మంగళవారం జోడేఘాట్, పాట్నాపూర్, బాబేఝరి, శివాగూడ, పాటగూడ, పిట్టగూడ, కొలాంగూడ, మహారాజ్గూడ తదితర గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేశారు. పలు గ్రామాల్లో ట్యాంకర్ ద్వారా తాగు నీటిని అందించారు.