కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పలు గ్రామాలకు మంగళవారం తాగు నీటిని సరఫరా చేశారు. తాగు నీరందక గిరిజనులు సోమవారం కెరమెరి మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేశారు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో మూడు, నాలుగు రోజుల నుంచి తాగునీరు రావడం లేదని మహిళలు ఆగ్రహించారు. ఖాళీ బిందెలతో మంగళవారం మెదక్ చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని 8వ వార్డులో తాగునీరు రావడం లేదని మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం ఆందోళనకు దిగారు. వారం రోజులుగా నల్లా నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున�