హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గార్ల మండలం దుబ్బగూడెం సమీపంలో మున్నేరు వాగు పై ప్రభుత్వం నిర్మించనున్న పాలేరు లింక్ కెనాల్ ప్రాజెక్ట్ సర్వే పనులను గిరిజనులు అడ్డుకున్నారు. తమ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే పాలేరు లింక్ కెనాల్ ప్రాజెక్టు ఒప్పుకునేది లేదని, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బుద్దారం గిరిజనులు రోడ్డు పై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చావనైనా చస్తాము తప్ప మా భూములను వదులుకోబోమని హెచ్చంచారు. పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
పాలేరు లింక్ కెనాల్ సర్వే పనులను అడ్డుకున్న గిరిజనులు
చావనైనా చస్తాము తప్ప మా భూములను వదులుకోబోమని హెచ్చరిక
గార్ల మండలం దుబ్బగూడెం సమీపంలో మున్నేరు వాగు పై ప్రభుత్వం నిర్మించనున్న పాలేరు లింక్ కెనాల్ ప్రాజెక్ట్ సర్వే పనులను అడ్డుకున్న… pic.twitter.com/kmBI5YZwHf
— Telugu Scribe (@TeluguScribe) June 17, 2026