చర్ల, మే 19 : ఎన్నో ఏళ్లుగా మండల సరిహద్దుల్లో స్థిర నివాసం ఏర్పర్చుకుని ఉంటున్న తమకు కోయ కుల ధ్రువీకరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల తహసీల్ కార్యాలయాన్ని వలస ఆదివాసీలు సోమవారం ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు రేషన్‌కార్డు, ఓటు హక్కు కల్పించిన ప్రభుత్వం కోయ కుల ధ్రువీకరణ పత్రాలు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం కుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరికావడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ మొగిలి శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు.