వనపర్తి జిల్లా కందిరీగ తండాలో కొందరు రైతులు వరికి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. చేతికి వచ్చిన చేలు కండ్ల ముందు ఎండిపోతుంటే.. చూడలేక ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి బతికించుకునేందుకు ఆరాట పడుతున్నారు. అయినా ఈ నీళ్లు సరిపోతలేవని ఆందోళన చెందుతున్నారు. మడిలో వదిలిన నీరు ముందుకు పోవడం లేదని వాపోతున్నారు. రోజు పది ట్యాంకర్లు మడిలో పోసినా ఒక్క మడి కూడా తడవడం లేదని గిరిజన రైతులు లబోదిబోమంటున్నారు.
నేను మూడు ఎకరాల్లో వరి సాగుచేసిన. పంట గొలక వేసే సమయంలో సాగునీరు అందక పూర్తిగా ఎండిపోయింది. పంట పూర్తిగా ఎండిపోయింది. మునుపెప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలే. గడ్డి మాత్రమే మిగిలింది. ప్రభుత్వమే ఆదుకోవాలి.