నేటి నుంచి టిమ్స్‌లో ట్రయల్ రన్
సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి హాస్పిటల్లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.
- 22 విభాగాల్లో ఓపీ సేవలు
- అధికారులకు దామోదర ఆదేశాలు
హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి హాస్పిటల్లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు నెల రోజుల పాటు ట్రయల్ రన్ కొనసాగనుంది.
ఇందులో భాగంగా రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్ పేషెంట్, డయాగ్నొస్టిక్స్ సేవలు అందించనున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీతోపాటు మొత్తం 22 విభాగాల్లో ట్రయల్ రన్ కొనసాగనుంది.
జనగణనలో బీసీ జాబితాపై స్పష్టతనివ్వాలి : నిరంజన్
హైదరాబాద్, ఏప్రిల్30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బీసీ కులాలను జనగణనలో ఏవిధంగా నమోదు చేస్తారనే అంశంపై స్పష్టతనివ్వాలని జనగణన డైరెక్టర్ భారతి హొళికేరిని రాష్ట్ర బీసీ కమిషన్ కోరింది. ఈ మేరకు జనగణన డైరెక్టర్‌కు కమిషన్ చైర్మన్ నిరంజన్ గురువారం ఒక లేఖ రాశారు. జనగణనలో భాగంగా మొదటి విడుతలో చేపట్టిన హౌస్‌లిస్టింగ్, మ్యాపింగ్ కాలమ్‌లో బీసీలు కాలమ్ లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. రెండో విడుత జనాభా సేకరణలో బీసీల వివరాలను సేకరిస్తామని చెప్పడంపై అసంతృప్తిని వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని బీసీ కులాల జాబితాను డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్కు పంపించడంతోపాటు, ఆయా కులాలవారీగా వివరాలను ఏవిధంగా రెండో విడుత జాబితాలో నమోదు చేస్తారో స్పష్టంగా వివరించాలని లేఖలో కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

