హైదరాబాద్ : కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనను మరువకముందే హైదరాబాద్‌లో పెద్దఅంబర్‌పేట ఓఆర్ఆర్పై మరో ప్రైవేట్ బస్సు బోల్తా (Bus over turn ) పడింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఏపీ 39 యూపీ 1963 నంబరు గల ‘న్యూ గో ’ అనే ఎలక్ట్రికల్ ట్రావెల్ బస్సు మియాపూర్ నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నారు. గాయపడ్డ క్షతగాత్రులను డీఆర్డీవో, హయాత్‌నగర్‌లో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్
కర్నూలు బస్సు ప్రమాదం మరవక ముందే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం
పెద్ద అంబర్ పేట్ వద్ద ORR నుంచి కిందకు బోల్తా పడిన న్యూగో ఎలక్ట్రికల్ బస్సు
బస్సులో ఉన్న 20 మందికి పైగా ప్రయాణికులు.. పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
మియాపూర్ నుంచి గుంటూరు… pic.twitter.com/mBfKNumpnN
— Telugu Scribe (@TeluguScribe) October 25, 2025
శుక్రవారం తెల్లవారుజాము కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ( DD01N9490) పల్సర్ బైకును ఢీకొట్టింది. బైకు ట్యాంక్ పేలడంతో బస్సు కింద ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి బస్సు మొత్తానికి వ్యాపించడంతో క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది సజీవదహనమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో మరో 27 మంది స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 44 మంది ఉన్నారు