హైదరాబాద్, సెప్టెంబర్ 19(నమస్తే తెలంగాణ) : జనవరి 1 నుంచి కాలుష్యకారక వాహనాల రద్దుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. దీని అమలు ప్రకారం ఏదైనా వెహికిల్ 15ఏండ్లు దాటితే రోడ్డుపై తిరగడానికి వీలు ఉండదు. ఒకవేళ వాహనం కండీషన్లో ఉంటే ప్రభుత్వం నిర్వహించే ఫిట్నెస్ టెస్టులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
లేకుంటే వాటిని రోడ్లపైకి అనుమతించరు. త్వరలోనే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు సమాచారం. 15 ఏండ్లకు పైబడిన వాహనాలకు ఫిట్నెస్ లేనట్లు తేలితే యజమానులు వాహనాన్ని స్రాప్ చేయాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ట్రాఫిక్ నియమాల మేరకు ఫైన్ లేదా వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంటుంది.
అయితే టెస్టులో ఫిట్నెస్ ఉన్నట్టు గుర్తించిన వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ చెల్లించి అదనంగా 3-5 ఏండ్లపాటు కొనసాగించవచ్చు. రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెహికిల్ స్రాపేజ్ పాలసీ ముసాయిదా బిల్లును రూపొందించి ఆమోదం కోసం ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది.