జైపూర్, డిసెంబర్ 4 : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంట్రావుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ వైశాలి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. వెంకట్రావుపల్లి సర్పంచ్ స్థానాన్ని జనరల్‌కు కేటాయించగా, ఎస్సీ ట్రాన్స్‌జెండర్ అయిన వైశాలి నామినేషన్ వేశారు. ఆదరించి ఓట్లు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని వైశాలి కోరుతున్నారు.
ఎల్లారెడ్డి రూరల్/నాగిరెడ్డిపేట, డిసెంబర్ 4: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట ఎంపీడీవో లలితాకుమారి, ఎంపీవో ప్రభాకర్‌ను సస్పెండ్ చేశారు. వార్డు స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలను ఉన్నతాధికారులకు తప్పుగా పంపించడం, దీనిపై జిల్లా అధికారులు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించక పోవడంతోపాటు స్థానికంగా ఉండకుండా ఎన్నికల విధులను నిర్లక్ష్యం చేస్తున్నట్టు గుర్తించిన అధికారులు విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో, ఎంపీవోను సస్పెండ్ చేస్తూ జడ్పీ సీఈవో చందర్‌నాయక్ ఆదేశాలు జారీచేశారు.