హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): వైద్యశాఖలో బదిలీల ను పారదర్శకంగా నిర్వహించాలని తెలంగాణ వైద్య, ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అ ధ్యక్షుడు కర్నాటి సాయిరెడ్డి, వర్కిం గ్ ప్రెసిడెంట్ జీ రాజశేఖర్, ఉపాధ్యక్షుడు కే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘బదిలీల నుంచి మినహాయింపు పొందేందుకు సెన్సస్ విధులు వేయించుకున్న ఉద్యోగులను వెనక్కి రప్పించాలని కోరారు. కార్మికశాఖ అధికారులు 25 ఏండ్లుగా సంఘాలకు ఎన్నికలు జరుపకపోగా, ఇష్టానుసారంగా గుర్తింపు కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. అధికారులు స్పౌజ్ బదిలీలకు సంబంధించిన గైడ్లైన్స్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ కాంట్రాక్ట్ సర్వీసులో స్పౌజ్ ఉంటే, రెగ్యులర్ ఉద్యోగికి స్పౌజ్ బదిలీల్లో ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు.