హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖలో పలువురు అదనపు డైరెక్టర్ల(అడిషనల్ డైరెక్టర్ల)ను బదిలీచేశారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైర్టెకర్ శ్రీదేవసేన ఉత్తర్వులిచ్చారు. పరిపాలన సౌలభ్యం దృష్ట్యా పలువురు ఉన్నతాధికారులకు స్థానచలనం కల్పించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వయోజన విద్య డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎస్ విజయలక్ష్మీబాయిని రామంతాపూర్‌లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ (సైట్) డైరెక్టర్‌గా నియమించి, అక్కడున్న ఏ కృష్ణారావును బదిలీచేశారు. మాడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్‌గా ఉన్న జీ ఉషారాణిని బదిలీచేసి, వయోజన విద్య డైరెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ సెక్రటరీగా పనిచేస్తున్న సీహెచ్ రమణకుమార్‌కు తెలంగాణ మాడల్ స్కూల్స్ అడిషనల్ డైరెక్టర్‌గా, జవహార్ బాల భవన్ స్పెషలాఫీసర్‌గా అదనపు బాధ్యతలప్పగించారు. సైట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కృష్ణారావు ప్రస్తుతానికి వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉన్నారు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌గా బాధ్యతల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.