DSP Transfers | రాష్ట్రంలో 41 మంది డీఎస్పీల బదిలీలు.. ఇవీ డిటైల్స్
DSP Transfers | రాష్ట్రంలో 41 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజినీ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
DSP Transfers | రాష్ట్రంలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. 41 మంది పోలీసు అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ అంజినీ కుమార్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలు ఇలా..
ప్రస్తుతం హైదరాబాద్‌లోని సీఐడీ విభాగంలో డీఎస్పీగా ఉన్న జే వెంకటరెడ్డిని నారాయణ్‌ఖేడ్‌కు బదిలీ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఏసీపీగా పని చేస్తున్న ఎన్ వెంకటేశ్ ను.. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచ డీఎస్పీగా ట్రాన్స్ ఫర్ చేశారు. ఇప్పుడు పాల్వంచ డీఎస్పీగా పని చేస్తున్న తాల్లపెల్లి సత్యనారాయణను హైదరాబాద్ లోని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
బాసర రాజీవ్ యూనివర్సిటీ డీఎస్పీగా పని చేస్తున్న వీపూరి సురేశ్ ను.. కామారెడ్డి డీఎస్పీగా బదిలీ చేశారు. ఇప్పుడు కామారెడ్డి డీఎస్పీగా పని చేస్తున్న సోమనాధంను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సీఐడీలో సైబర్ క్రైమ్స్ వింగ్ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న బీ రవి కుమార్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ డీఎస్పీగా ట్రాన్స్ ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సీసీఎస్ ఏసీపీగా పని చేస్తున్న వై వెంకటరెడ్డిని కుషాయిగూడ ఏసీగా బదిలీ చేశారు.
వరంగల్ సీఎస్బీ ఏసీపీగా పని చేస్తున్న ఎస్కే అబ్దుల్ రహ్మాన్‌ను కొత్తగూడెం ఎస్డీపీవోగా బదిలీ చేశారు. అక్కడ డీఎస్పీగా పని చేస్తున్న జీ వెంకటేశ్వర బాబును డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కుమ్రం భీం-అసిఫాబాద్ ఫంక్షనల్ వెర్టికల్స్-డీసీఆర్బీ డీఎస్పీగా పని చేస్తున్న సీహెచ్ నాగేందర్ ను ఉట్నూర్ సబ్ డివిజన్ ఎస్డీపీవోగా బదిలీ చేశారు.
హైదరాబాద్ లోని ఇంటెలిజెన్స్ వింగ్ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న పూనాటి నర్సింహారావును మియాపూర్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. అక్కడ పని చేస్తున్న ఎస్ క్రుష్ణ ప్రసాద్ ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ ఇంటెలిజెన్స్ వింగ్ డీఎస్పీగా పని చేస్తున్న పీ వెంకటగిరిని మియాపూర్ డీఎస్పీగా ట్రాన్స్ పర్ చేశారు. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న బంటు కిషన్ ను వరంగల్ సీసీఆర్బీ ఏసీపీగా నియమించారు.
మెదక్ జిల్లా డీసీఆర్బీ డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కే బాలక్రుష్ణారెడ్డిని హైదరాబాద్ మెట్రో రైల్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. పంజాగుట్ట ఏసీపీగా పని చేస్తున్న పీవీ గణేశ్ ను ఖమ్మం టౌన్ ఏసీపీగా నియమించారు. ఇప్పుడు ఖమ్మం టౌన్ ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న బీ ఆంజనేయులును డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పంజాగుట్ట ఏసీపీగా ప్రస్తుతం సీసీఎస్ విభాగం ఏసీపీగా పని చేస్తున్న ఎస్ మోహన్ కుమార్ ను నియమించారు.
మిర్యాలగూడ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న వై వెంకటేశ్వరరావును ఖమ్మం టాస్క్ ఫోర్స్ ఏసీపీగా నియమించారు. బెల్లంపల్లి ఏసీపీ ఏ మహేశ్ ను పెద్దపల్లి ఏసీపీగా బదిలీ చేశారు. పెద్దపల్లి ఏసీపీగా పని చేస్తున్న సారందపాణి సాదులను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
డీజీపీ ఆఫీసులో రోడ్ సేఫ్టీ డీఎస్పీగా పని చేస్తున్న శామల వెంకట్ రెడ్డిని మేడ్చల్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. వరంగల్ సీసీఆర్బీ, ఫంక్షనల్ వెర్టికల్స్ విభాగం ఏసీపీగా పని చేస్తున్న టీ క్రుపాకర్ ను మమ్మూర్ ఏసీపీగా బదిలీ చేశారు. అక్కడ ఏసీపీగా ఉన్న ఏ నరేశ్ కుమార్ ను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
భువనగిరి ట్రైనీ ఏసీపీగా ఉన్న ఎన్ సైదులును రాచకొండ-యాదాద్రి ఏసీపీగా పోస్ట్ చేశారు. అక్కడ ఏసీపీగా పని చేస్తున్న వై నరసింహారెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎండీఏ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న జీవీ రమణ గౌడ్ ను నార్సింగి ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. ఎల్బీ నగర్ ట్రైనీ ఏసీపీగా పని చేస్తున్న సీ అంజయ్యను మహేశ్వరం ఎల్ అండ్ ఓ ఏసీపీగా నియమించారు.
నల్లగొండ డీటీసీగా పని చేస్తున్న కాపుగంటి శ్రీనివాసరావును హైదరాబాద్ సౌత్ జోన్ ట్రాఫిక్ ఏసీపీగా నియమించారు. అక్కడ పని చేస్తున్న వీ శ్రీనివాసరెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సైబరాబాద్ సీఏఆర్, సీఎస్‌డబ్లూ ఏసీపీగా ఉన్న పీ ధనలక్ష్మిని కూకట్ పల్లి ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. ఇప్పటి వరకు అక్కడ విధులు నిర్వహిస్తున్న జీ హనుమంత రావును డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇంటెలిజెన్స్ వింగ్ డీఎస్పీగా ఉన్న పూర్ణ చందర్ ను అబిడ్స్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. ఇప్పటివరకు అబిడ్స్ ఏసీపీగా ఉన్న కడారు వెంకట్ రెడ్డిని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. సంగారెడ్డి డీటీసీ డీఎస్పీగా ఉన్న సామిండ్ల ప్రభాకర్ ను చేవెళ్ల ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. ప్రస్తుతం చేవెళ్ల ఏసీపీగా ఉన్న పైలా రవీందర్ రెడ్డిని డీజీపీ ఆపీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
హైదరాబాద్ సిటీ సీసీఎస్-డీడీ ఏసీపీగా ఉన్న ఎస్ఆర్ దామోదర్ రెడ్డిని మీర్ చౌక్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. ఇంటెలిజెన్స్ వింగ్ డీఎస్పీ మహమ్మద్ గౌస్ ను సంతోష్ నగర్ ఏసీపీగా ట్రాన్స్ ఫర్ చేశారు. ప్రమోటెడ్ ఏసీపీ రుద్ర భాస్కర్ ను చార్మినార్ ఏసీపీగా నియమించారు. సీఐడీ డీఎస్పీ జీ శ్యామ్ సుందర్ ను మలక్ పేట ఏసీపీగా నియమించారు. మలక్ పేట ఏసీపీగా ఉన్న ఎన్ వెంకట రమణను డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

