హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 13మంది అడిషనల్ ఎస్పీ (నాన్‌కేడర్)లను బదిలీ చేస్తూ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో వెయిటింగ్లో ఉన్న ఐదుగురికి పోస్టింగ్‌లు ఇవ్వగా, ఇద్దరిని డీజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. కాగా, ముగ్గురికి ప్రమోషన్‌తోపాటు, పోస్టింగ్‌లు ఇచ్చారు.
బదిలీ ఉత్తర్వులు, పోస్టింగ్‌లు అందుకున్న వారిలో జీ వెంకటేశ్వరబాబు, జీ బాలస్వామి, కోట్ల నర్సింహారెడ్డి, సీహెచ్ రామేశ్వర్, కే నరహరి, ఎం నాగేశ్వరరావు, కే రామ్‌కుమార్, బీ శ్రీకృష్ణగౌడ్, కోట్ల వెంకట్‌రెడ్డి, కే శంకర్, జీ భిక్షంరెడ్డి, బోనాల కిషన్, ఎం సుదర్శన్ ఉన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని, డీజీపీ జితేందర్ ఈ బదిలీపై చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.