హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులను బదిలీ చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి బ్రిజేష్ నేతృత్వంలోని బృందం గురువారం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎడ్యుకేషన్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను కోరింది. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే బదిలీలపై నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. బృందంలో డాక్టర్ సంగీ రమేశ్, డాక్టర్ విజయ్‌కుమార్ తదితరులున్నారు.