హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): పౌరసరఫరాలు, వ్యవసాయశాఖల అధికారులు, ఉద్యోగులు శనివారం ఆనందంలో మునిగితేలారు. ఉదయం నుంచి ఒకరికొకరు ఫోన్లు చే సుకుంటూ సంతోషాన్ని పంచుకున్నారు.
వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, సివిల్ సప్లయ్స్ కమిషనర్ డీఎస్ చౌహాన్ బదిలీ కావడమే ఇందుకు కార ణం. ఈ ఇద్దరు అధికారుల వ్యవహారశైలిపై రెండు శాఖల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం నెలకొంది. వీరు ఎప్పుడు బదిలీ అవుతారా అంటూ రెండు శాఖల ఉద్యోగులు ఎదు రు చూస్తున్నారు.