హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : ఇరిగేషన్‌శాఖలో నిర్వహించిన బదిలీలన్నీ పారదర్శకంగానే కొనసాగాయని తెలంగాణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ అసోసియేషన్ వెల్లడించింది. పత్రికల్లో ప్రచురితమవుతున్న కథనాలన్నీ అవాస్తవమని వెల్లడించింది. ఇరిగేషన్‌శాఖ ఈఎన్సీ (అడ్మిన్) టీ శ్రీనివాస్‌ను అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ నాగరాజు, కోశాధికారి సంతోష్‌రెడ్డి గురువారం కలిశారు. బదిలీలు విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పత్రికల్లో బదిలీలపై వస్తున్న కథనాలను ఖండించారు. పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ల ప్రక్రియను త్వరలో చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఈఎన్సీ హామీ ఇచ్చారని తెలిపారు.
బదిలీ చేసి నాలుగు రోజులు గడవకముందే ఇరిగేషన్‌శాఖ సదరు ఉత్తర్వులను రద్దు చేసింది. ఇరిగేషన్‌శాఖ ఓఅండ్ఎం (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) విభాగంలో ఎస్ఈగా విధులు నిర్వర్తిస్తున్న పీ సత్యనారాయణరెడ్డికి ప్రభుత్వం సంగారెడ్డి సీఈగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయన జూన్1న విధుల్లో కూడా చేరారు. తాజాగా ఆయన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడిదే విషయం శాఖలో చర్చనీయాంశంగా మారింది.