IPS Transfers | హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం 15 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీచేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రేవంత్ సర్కార్ అలా పోస్టింగ్ ఇస్తూనే మరోవైపు ఇలా స్థానచలనం కల్పిస్తున్నది. సీనియర్ ఐపీఎస్ అధికారులు గిరిధర్, తరుణ్‌జోషి తమ స్థానాల్లో కుదురుకోక ముందే మరోసారి బదిలీ చేసింది.
రెండు నెలలు తిరగకుండానే బదిలీలు
గత డిసెంబర్ 13న రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్‌ను మార్చి సుధీర్‌బాబును నియమించిన రేవంత్ సరార్ రెండు నెలలు తిరగకుండానే ఆయనను బదిలీచేసి తరుణ్జోషిని కమిషనర్‌గా నియమించింది. నాలుగు నెలలకే ఇప్పుడాయన స్థానంలో మళ్లీ జీ సుధీర్‌బాబును తీసుకొచ్చింది. దీంతో ఏడు నెలల్లో రాచకొండ కమిషనరేట్‌కు నాలుగో కమిషనర్ వచ్చినట్టయ్యింది. పరిపాలనా అనుభవం లేని రేవంత్‌రెడ్డి రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టాక జరుగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చూసి రాష్ట్ర ప్రజలు, మీడియా, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ముకున వేలేసుకుంటున్నారు.
విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఆనంద్..
ఏసీబీ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్‌కు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది.
ఇదేదో పిల్లల ఆటలా ఉన్నది.
అధికారుల బదిలీలు చిన్నపిల్లల ఆటలాగా ఉన్నది. సీనియర్ అధికారులను కనీసం రెండు మూడేండ్లయినా ఒక పోస్టింగ్‌లో ఉంచడం ఆనవాయితీ. అప్పుడే సదరు అధికారి ఆ పోస్టులో కుదురుకొని కొంత మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉంటుంది. కానీ, రేవంత్ వచ్చాక అనేకమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఫుట్‌బాల్ ఆడినట్టు బదిలీలు చేస్తున్నారు. దీంతో ఆ అధికారులు ఎకడా కుదురుకోలేకపోతున్నారు. ఎప్పుడు ఉంటా మో, ఎప్పుడు పోతామో తెలియని గందరగోళంలో ఆఫీసర్లు కూడా ఏ పనినీ సీరియస్‌గా తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. రా ష్ట్రంలో పాలన కూడా పూర్తిగా గాడితప్పింది. ఇది రేవంత్ అనుభవరాహిత్యం, నీడను కూడా అనుమానించే విశ్వాసరాహిత్యం తప్ప మరొకటి కాదు. దీనివల్ల తెలంగాణలో పాలన మాత్రం కుంటుపడుతున్నది.
-కొణతం దిలీప్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్